/home2/twebezli/public_html/wordpress-TE/mopo/wp-content/mu-plugins మాటల్లేవంతే! – Telugu Mopo

మాటల్లేవంతే!

బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్‌ కీలక పాత్రలో నటించిన ‘భూల్‌ భూలయ్యా 3’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. హారర్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె మంజులిక పాత్రలో నటించి మెప్పించింది. తన చిత్రం విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్‌ సినిమా విశేషాలను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ, విద్యాబాలన్‌ ఏం మాట్లాడింది అంటే.. ‘ప్రేక్షకులు మా ‘భూల్‌ భూలయ్యా 3’ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్‌ సక్సెస్‌. ఇలాంటి విజయం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ‘భూల్‌ భూలయ్యా’ ఫ్రాంఛైజీలో భాగం అవుతానని.. మరోసారి మంజులిక పాత్ర పోషిస్తానని అస్సలు ఊహించలేదు. ఎన్నో ఏళ్లు అయినప్పటికీ ప్రేక్షకులు ఆ పాత్రను ఇంకా ఎంతో బాగా అక్కున చేర్చుకుంటున్నారు.  నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’ అంటూ విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular Stories