/home2/twebezli/public_html/wordpress-TE/mopo/wp-content/mu-plugins వర్మ వర్మ వర్మ …మాకు క్యాస్ట్‌ ఫీలింగ్‌ లేదు! – Telugu Mopo

వర్మ వర్మ వర్మ …మాకు క్యాస్ట్‌ ఫీలింగ్‌ లేదు!

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్లలో తెలుగులో మొట్టమొదటి సూపర్‌ హీరో సినిమాని అందించిన యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా ఒకరు. ఆయన తాజాగా జై హనుమాన్‌ వంటి భారీ సినిమాల్లో ఫుల్‌ బిజీగా ఉండగా తాజాగా ఆయన మరో ఇద్దరు వర్మలతో కలిసి కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

మరి ఇండియన్ సినిమా దగ్గర సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే తనతో పాటుగా ఓటీటీలో సెన్సేషనల్ సిరీస్ లు ది ఫ్యామిలీ మ్యాన్, రానా నాయుడు, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వంటివి తీసిన సుపార్న్ ఎస్ వర్మ ముగ్గురూ కలిసి కనిపించారు.

 దీంతో ఈ ముగ్గురు సెన్సేషనల్ దర్శకుల పిక్ తో రామ్ గోపాల్ వర్మ తన మార్క్ క్రేజీ పోస్ట్ పెట్టారు వర్మ వర్మ వర్మ నిజం చెప్తున్నాను మాకు ఎలాంటి కుల ఫీలింగ్ లేదు అంటూ ఆ ఇద్దరినీ ట్యాగ్ చేశారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ కలయిక ఎందుకు జరిగింది అనేది మాత్రం తెలియలేదు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular Stories