/home2/twebezli/public_html/wordpress-TE/mopo/wp-content/mu-plugins మట్కాతో ఆ ట్రీట్‌ కు రెడీ అయిన ఆ మూవీ! – Telugu Mopo

మట్కాతో ఆ ట్రీట్‌ కు రెడీ అయిన ఆ మూవీ!

మెగా యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కరుణ కుమార్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “మట్కా”. మరి ఈ వారం థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా అయితే డీసెంట్ బజ్ ని సెట్ చేసుకొని వస్తుంది. అలాగే వరుణ్ తేజ్ రీసెంట్ గా చేసిన పలు కామెంట్స్ తో కూడా మట్కా ఆడియెన్స్ లో బాగా పాపులర్‌ అయ్యింది. ఇక ఈ సినిమాతో అయితే మెగా ఫ్యాన్స్ కి మరో సాలిడ్ ట్రీట్ ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

తాజాగా  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్‌ అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్” టీజర్ వచ్చి భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందన్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా టీజర్ అయితే ఇపుడు బిగ్ స్క్రీన్స్ పై సందడి చేసేందుకు సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. అది కూడా మట్కా ప్రదర్శితం అవుతున్న అన్ని థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ ట్రీట్ కూడా ఉండనుందని సమాచారం. దీంతో మట్కా కోసం వెళ్లే మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఉంటుంది అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular Stories